Translate

Wednesday, August 10, 2016

కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

తెలంగాణ రాష్ట్రంలోని 10జిల్లాల నుంచి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసి 2500 బస్సులను ఏర్పాటు చేసి సేవలందిస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి డాక్టర్‌.పి.మహేందర్‌రెడ్డి అన్నారు
రాష్ట్రం నుంచి గోదావారి పుష్కరాలకు కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని జరుగు చున్న పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం 2500 బస్సులు ఆదిలాబాద్‌ నుంచి 310, కరీంనగర్‌ నుంచి 415, వరంగల్‌ నుంచి 365, నిజామాబాద్‌ నుంచి 300, ఖమ్మం నుంచి 360, హైద్రాబాద్‌, రంగారెడ్డిజిల్లాల నుండి 530బస్సులు సేవలందిస్తున్నాయన్నారు.ఈ నెల 14 నుంచి 21 వరకు 16లక్షల నుంచి ప్రయాణీకులకు సేవలందించిడం జరుగుందన్నారు. పుష్కరాలు జరుగుచున్న ధర్మపురిలో 50,భద్రచలంలో 150,కందుకర్తిలో 40,బస్సులను ఉచితంగా బస్‌ స్టేషన్‌ నుంచి పుష్కరఘాట్‌ వరకు తీసుకెళ్లడం జరిగిందన్నారు.
పుష్కరాల వచ్చే భక్తులకు ఆర్టీసి ద్వారా మెరుగైన సేవలందించేందుకు ఈడి స్థాయి అధి కారి పర్యవేక్షణకు నియమించడంతో పాటు బస్‌ స్టాప్‌ల వద్ద తాత్కలిక టెంట్లు, మంచి నీటి సదుపాయాలు,సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసి పవిత్ర పుష్కరా లకు వచ్చే భక్తులకు సేవలందించడం జరుగుతుందన్నారు.

No comments:

Post a Comment